దుబాయ్ లో 2 లక్షల దిర్హామ్ల విలువైన పిల్లలదుస్తుల చోరీకి ప్రయత్నం

- September 30, 2017 , by Maagulf
దుబాయ్ లో 2 లక్షల దిర్హామ్ల విలువైన పిల్లలదుస్తుల చోరీకి  ప్రయత్నం

దుబాయ్ : దేశం కానీ దేశంలో నమ్మకంగా విధేయంగా ఉండాల్సిన ఆ పాకిస్తాన్ ప్రవాసీయులు పార్ట్ టైం పనిగా దొంగతనాలను ఎంచుకొన్నారు.  21 మరియు 33 మధ్య వయస్సులో ఉన్న ముగ్గురు పాకిస్తానీ కార్మికులు ఒక దొంగల ముఠాగా ఏర్పడి  రాస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని దొంగతనం చేయటానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి, ఈ దొంగలు 2 లక్షల విలువైన పిల్లల దుస్తులను కలిగి ఉన్న గిడ్డంగి తాళు తెరవటానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడకు ఒక కారు రావడంతో వారు దానిని చూసి అక్కడ నుంచి పారిపోయారు. ఆ చోరుల ముఠా ఆగస్టు 4 వ తేదీన  రాస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని గిడ్డంగిని దోచుకోవాలని ప్రయత్నించారు, వారంతా  21 ఏళ్ళ నుంచి 33 ఏళ్ల వయస్సులో ఉన్న ముగ్గురు పాకిస్తానీ కార్మికులుగా వారిని గుర్తించారు. ఈ గిడ్డంగి ఒక చైనా వ్యాపారవేత్తకు చెందినది. కోర్టు అఫ్ ఫస్ట్ ఇన్స్టాన్ లో  గిడ్డింగు యజమాని ఆ నేరం గూర్చి న్యాయాధికారులతో చెబుతూ, ఆ దొంగల ముఠా తన గిడ్డింగిలో దోపిడీకి విఫల ప్రయత్నం చేశారని విన్నవించారు. ఆగష్టు 3 వ తేదీన  2.30 గంటలకు, గిడ్డంగి యజమాని గిడ్డంగిని మూసివేశారు మరియు తాళం వేసినట్లు తెలిపారు. అయితే, ఆగస్టు 5 వ తేదీన  7 గంటలకు తనను పోలీసులు పిలిచారని యజమాని తెలిపారు. నేను గిడ్డింగు లోపల వస్తువులు తనిఖీ చేశాను, ఏదీ దొంగిలించబడలేదు, నేను సీసీ టీవీ  ను తనిఖీ చేసాను మరియు ఆగస్టు 4 తేదీన రాత్రి  8.30 గంటలకు దొంగలు వచ్చారని కనుగొన్నారు. ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు  ఒక పదునైన సాధనంతో తాళంను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించాయి.కానీ కారు వస్తున్నట్లు కనిపెట్టిన తర్వాత ఆ స్థలాన్ని తప్పించుకునేందుకు వారు మూడు గంటల సమయం తీసుకున్నారు '' అని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. సీసీ టీవీ  రికార్డింగులతో, దొంగల బృందంలో ఒకరని  స్పష్టమైన ఫోటోను గుర్తించాం ఆ నిందితుడి ద్వారా మిగిలిన సహచర దొంగలను  ఆగస్టు 7 వ తేదీన పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.వీరిలో ఇద్దరు గతంలో ఈ దుస్తుల గిడ్డంగి యజమాని వద్ద బరువులు మోసే కూలీలుగా (పోర్టర్లుగా) పనిచేశారు. ముందుగా దొరికిన నిందితుడు  తన స్నేహితుల దోపిడీ ప్రణాళిక గురించి తెలియదు అని వారితో పాటు సరదాగా వెళ్లేనని తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com