ఆకర్షిస్తున్న షేక్ మొహమ్మద్ చిరుతతో నడిచి వెళుతున్న వీడియో
- September 30, 2017
ఆకర్షిస్తున్న షేక్ మొహమ్మద్ చిరుతతో నడిచి వెళుతున్న వీడియో
యూఏఈ : యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ యొక్క పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఒక చిరుతతో సరదాగా నడుస్తూ వెళ్తున్న ఒక వీడియోను ఆయన భార్య ప్రిన్సెస్ హాయా తన ఇంస్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ చిన్న వీడియో క్లిప్ లో దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన కుడివైపున చిరుత పక్కన నడుస్తున్నట్లు ఉండే ఆ వీడియో పలువురిని ఆకర్షించింది. ప్రపంచంలో వేగంగా భూమిపై పరుగెత్తే జంతువు సైతం షేక్ మహ్మద్ చిరుత పక్కన కూర్చుని ఆనందిస్తుందని ఆ వీడియో శీర్షికలో రాణి హాయ పేర్కొన్నారు. దుబాయ్ రూలర్ వ్యక్తిగతంగా చిరుతలను పెంచుతూ వాటిని ఇష్టంగా ఆయన పర్యవేక్షిస్థారని ఈ పెద్ద పిల్లి ఒక పిల్ల అనాథగా ఆయన వద్ద గారాలు పోతూ ఉందని ఈ బుల్లి చిరుత షేక్ మహ్మద్ యొక్క హృదయంలో ప్రేమ కరుణ సంపాదిందని ఆమె హాస్యంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







