వర్షం కారణంగా చెన్నై ఎయిర్పోర్ట్ లో విమాన రాకపోకలకు అంతరాయం
- October 01, 2017
భారీ వర్షాలు చెన్నైని ముంచెత్తాయి. కుంభవృష్టితో నగర వీధులు జలమయమయ్యాయి. వర్షాల తీవ్రతతో పాటు చెన్నై విమానాశ్రయాన్ని మేఘాలు కమ్మేయడంతో ఆదివారం ఉదయం 9 అంతర్జాతీయ విమానాలతో పాటు 14 ఫ్లైట్లను దారిమళ్లించారు. మరికొన్ని విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. చెన్నై నగరంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలతో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 3.50 గంటల వరకు చెన్నైకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. లండన్, అబుదాబి నుంచి చెన్నై రావాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను హైదరాబాద్‌కు మళ్లించినట్టు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. అయితే ఉదయం ఆరు గంటల తర్వాత విమాన రాకపోకలు యథాతథంగా సాగాయని వెల్లడించాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







