రవితేజతో ఫైట్ కి సిద్ధమంటున్న కింగ్
- October 01, 2017
ఈ దసరా వార్ లాగానే దీపావళికి ఇద్దరు హీరోలు దీపావళికి వార్ షురూ చేస్తున్నారు. నాగార్జున రాజుగారి గది-2 అక్టోబర్-13న, రవితేజ రాజా ది గ్రేట్ అక్టోబర్ 12న రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ నాగార్జున రాజుగారి గది-2 టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పివిపి బ్యానర్ లో ఓంకార్ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా కామిక్ హర్రర్ మూవీగా వస్తోంది. నాగ్ ఫస్ట్ టైం చేస్తోన్న ఈ హర్రర్ మూవీలో గ్రాఫిక్స్ కు ఫుల్ స్కోప్ ఉందట. దీంతో సినిమా ఐఫీస్ట్ గా ఉంటుందనే టాక్ తో దీపావళికి ప్రేక్షకుల ముందుకొస్తోంది రాజు గారి గది-2.
రెండేళ్లుగా ప్రేక్షకులముందుకురాని రవితేజ ఈదీపావళికి రాజా ది గ్రేట్ సినిమాతో వస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమాలో రవితేజ అంధుడిగా నటించాడు. ఐయామ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అనే డైలాగ్ తోనే ఈసినిమా అనిల్ రావిపూడి ఫార్మాట్ లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిందని చెప్పొచ్చు. రవితేజతో మెహరీన్ జోడీ కట్టింది. అక్టోబర్12న ఈసినిమా రిలీజ్ అవుతోంది. మరి ఈ దీవాళి ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







