సోషల్ మీడియాలో మహిళ డ్రైవర్లను బెదిరిస్తున్న సౌదీ యువకుడు అరెస్టు
- October 01, 2017
జెడ్డా : మహిళలు పురుషులతో సమానంగా ఇకపై వాహనాలు నడపవచ్చని గల్ఫ్ దేశాలలో రాజాజ్ఞ జారీ అవుతుంటే మరో పక్క స్రీలు తమతో సమానం కాకూడదంటూ కొందరు సైకోలు తమ వికృత తత్వాన్ని ప్రదర్శిసిస్తున్నారు. తూర్పు ప్రావిన్స్‌లో లో సోషల్ మీడియాలో వాహనాలు నడపరాదని మహిళ డ్రైవర్లను బెదిరిస్తున్న ఒక యువకుడిని అరెస్టు చేశారు. వాహనాలు నడుపుతూ తనకు ఏ మహిళ అయినా కనబడితే కాల్చివేస్తానని వీడియో క్లిప్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చే సాడు. రెండవ వీడియో సైతం ఇదే విధంగా బెదరిస్తూ మరల ఆ నిందితుడు పోస్ట్ చేసాడు. అది వైరల్ కావడమే కాక వెలుగులోకి రావడం ఆ వ్యక్తిని గుర్తించేందుకు వీలు కల్గింది. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా పోలీసు ప్రతినిధి కల్నల్ జియాద్ అల్-రుకీతి మాట్లాడుతూ నిందితుడు 20 ఏళ్ళ సౌదీ యువకుడు అని పేర్కొంటూ అతడిని విచారణ చేయనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







