దీపావళి కానుకగా అఖిల్‌

- November 02, 2015 , by Maagulf
దీపావళి కానుకగా అఖిల్‌

నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్‌ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నామని నిర్మాత, నటుడు నితిన్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంపై అటు ప్రేక్షకుల్లోను, ఇటు అక్కినేని అభిమానుల్లోను చాలా అంచనాలున్నాయని, అందుకు తగ్గట్టు గానే ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా చాలా భారీ ఎత్తున నిర్మించడం జరిగిందన్నారు. తొలి చిత్రం తోనే అఖిల్‌కి హీరోగా మంచి పేరు వస్తుందని నితిన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com