యూ. ఏ. ఈ. వైద్య శాఖలో నియామకాలు
- November 02, 2015
అబుధాబీ లోని నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు జరగనున్న 'హెల్త్ కేర్ రిక్రూట్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఫైర్' లో పాల్గొనడానికి వచ్చే అభ్యర్డులలో అధిక విద్యార్హత గల, ఆసక్తి గల వారినుండి దరఖాస్తులను గ్రహిస్తామని దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ మూలంగా అర్హత గల యూ. ఏ. ఈ. నర్సులను ఆకర్షించడం ద్వారా, నర్సింగ్ వృత్తిలో తక్కువగా ఉన్న స్థానికుల శాతాన్ని పెంచాలన్నదే తమ ఉద్దేశమని, డైరక్టర్ ఆఫ్ నర్సింగ్ డిపార్ట్‌మెంట్ డా. సుమయా అల్ బాలుషి తెలిపారు. తమ వృత్తి జీవితంలో ప్రగతిని, ఉత్తమ ఉద్యోగ అవకాశాలను కోరుకునే స్పెషలిస్టులను, కన్సల్టెంట్ లను గ్రహించడం ద్వారా - విద్యా సంస్థలు, ఉద్యోగ మార్కెట్లో ఫార్మశీస్టులు, సైకాలజిస్టులు, ప్రజారోగ్య మరియు లేబరేటరీ టెక్నీషియన్లు, రెడీయాలజీ టెక్నీషియన్లు మరియు ఆరోగ్య శిక్షణ రంగాలలో మానవ వనరుల ఖాళీని భర్తీ చేయడమే తమ లక్ష్యమని శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







