దీపావళి తరువాత కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీ

- October 02, 2017 , by Maagulf
దీపావళి తరువాత కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీ

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు స్వీకరించబోతున్నారా.. తల్లి సోనియా నుంచి పగ్గాలు అందుకునే ముహూర్తం కూడా ఖరారైపోయిందా.. ఆ పార్టీ యువనేతల మాటలు అదే నిజమంటున్నాయి. ఆయన కాంగ్రెస్‌ను గాడిన పెడతారనే ఆశతో ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. దీపావళి తరువాత పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ యువనేత సచిన్ పైలెట్ ప్రకటించారు. రాజకీయాల్లో వ్యక్తులు సాధించిన విజయాలే వారి సమర్థతను చాటుతాయని తెలిపారు. దీపావళి తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న రాహుల్ పార్టీని చక్కదిద్దుతారన్నారు.

కాంగ్రెస్ పార్టీ గాడి తప్పిన ప్రతిసారీ ఒక గాంధీ వారసుడు బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపించారని .. అదే  సెంటిమెంట్‌ రాహుల్ గాంధీ విషయంలో కూడా నిజం అవుతుందన్నారు. రాహుల్ సోదరి ప్రియాంక వద్రా కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని హిట్ ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆమె క్రియాశీలకర రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు.

పనిలోపనిగా వారసత్వ రాజకీయాలను ఆ పార్టీ నేతలు సమర్థించుకున్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి రావడం, రాకపోవడం ఆమె పర్సనల్  విషయం అంటూనే..దేశంలో వారసత్వ రాజకీయాలు అత్యంత సహజమని తెలిపారు. వారసత్వ రాజకీయాలు అనేవి నేరం కాదన్నారు. వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారికి ప్రజా సేవప కూడా పూర్తి పట్టుంటుందన్నారు. సచిన్ మాటలతోదీపావళి తర్వాత ఏం జరుగుతుందా అని కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com