ఎమిరేట్స్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ...ముగ్గురికి గాయాలు
- October 02, 2017
ఉమ్ అల్ ఖ్వాన్ : ఆదివారం ఉదయం ఉమి అల్ క్వెయిన్లోని ఎతిహాడ్ రోడ్డుపై రెండు వాహనాల మధ్య జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక ఎమిరాటీ వ్యక్తి చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వాహనాలలో ఇరుక్కున్న డ్రైవర్ ను విడిపించేందుకు హైడ్రాలిక్ కట్టర్లు మరియు ఇతర సామగ్రిని ఉపయోగించాల్సి వచ్చింది. ఈ రెండు వాహనాలలో నల్గురు వ్యక్తులు ఇరుక్కున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో వాహనాల ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఉమ్ అల్ క్వాన్న్ ఎమిరేట్ లో సివిల్ డిఫెన్స్ విభాగంలో కేంద్రాల్లోని విభాగాల అధిపతి మేజర్ అబ్దుల్లా అల్ ఫలాహి, మాట్లాడుతూ .. సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ అప్రమత్తం చేసిన వెంటనే ట్రాఫిక్ పోలీస్, అంబులెన్సన్స్, పారామెడిక్స్, రెస్క్యూ జట్ల బృందం ఈ ప్రాంతానికి తరలించారు. పారామెడిక్స్ జట్లు గాయపడిన నలుగురికి ప్రాధమిక చికిత్స అందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







