ఎమిరేట్స్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ...ముగ్గురికి గాయాలు

- October 02, 2017 , by Maagulf
ఎమిరేట్స్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ...ముగ్గురికి గాయాలు

ఉమ్ అల్ ఖ్వాన్ : ఆదివారం ఉదయం ఉమి అల్ క్వెయిన్లోని ఎతిహాడ్ రోడ్డుపై రెండు వాహనాల మధ్య జరిగిన  ఒక రోడ్డు ప్రమాదంలో ఒక ఎమిరాటీ వ్యక్తి  చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా  గాయపడ్డారు.వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వాహనాలలో ఇరుక్కున్న డ్రైవర్ ను విడిపించేందుకు హైడ్రాలిక్ కట్టర్లు మరియు ఇతర సామగ్రిని ఉపయోగించాల్సి వచ్చింది. ఈ రెండు వాహనాలలో నల్గురు వ్యక్తులు ఇరుక్కున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో వాహనాల ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.  ఉమ్ అల్ క్వాన్న్ ఎమిరేట్ లో  సివిల్ డిఫెన్స్ విభాగంలో కేంద్రాల్లోని విభాగాల అధిపతి  మేజర్ అబ్దుల్లా అల్ ఫలాహి, మాట్లాడుతూ .. సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ అప్రమత్తం చేసిన వెంటనే ట్రాఫిక్ పోలీస్, అంబులెన్సన్స్, పారామెడిక్స్, రెస్క్యూ జట్ల బృందం ఈ ప్రాంతానికి తరలించారు. పారామెడిక్స్ జట్లు గాయపడిన నలుగురికి  ప్రాధమిక చికిత్స అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com