అమెరికా పర్యటనకు వెళ్లి లాస్‌వెగాస్‌లో చిక్కుకున్న తెలుగు టూరిస్టులు
- October 02, 2017
అమెరికా పర్యటనకు వెళ్లిన తెలుగువాళ్లు లాస్ వెగాస్‌లో చిక్కుకున్నారు. షూటౌట్ జరిగిన మండేలా బే హోటల్ పక్కనే ఉన్న బెలిజియా హోటల్లో మన తెలుగువాళ్లు బస చేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి మ్యూజిక్ ఫెస్టివల్లో కాల్పులు జరిగాయి. ఆ ఘటన సమయంలో తెలుగు జర్నలిస్టు ప్రేమ్ కుమార్ సమీపంలోనే ఉన్నాడు. నమస్తే తెలంగాణ నెట్డెస్క్తో అక్కడ జరిగిన అనుభవాలను అతను పంచుకున్నాడు. జర్నలిస్టు ప్రేమ్‌తో పాటు మరో అయిదుగు ప్రస్తుతం అమెరికా టూర్‌కు వెళ్లారు. అయితే లాస్ వెగాస్‌లో బస చేస్తున్న వారు కాల్పులు ఘటనతో ఒక్కసారిగా ఉలికిపడ్డారు.
కాల్పుల ఘటన జరగ్గానే లాస్ వెగాస్ రహదారులను మూసివేనట్లు జర్నలిస్టు ప్రేమ్ ఫోన్లో తెలిపాడు. మిత్రులు కూడా కొందరు ఆ హడావుడిలో విడిపోయినట్లు వివరించాడు. అయితే సమీప హోటల్ ప్రాంతంలోనూ జనం అంతా భయంతో నేలపై వాలారని, ఆ అయోమయంలో ఏం చేయాలో అర్థంకాక, తాము కూడా నేలపై పడుకుంటున్నట్లు తెలిపాడు. అయితే జనం పరుగుల మధ్య తమ మిత్రులందరూ చెల్లాచెదురు అయ్యారని గుర్తు చేశాడు. కానీ కొన్ని గంటల తర్వాత మళ్లీ ఒక్కొక్కరుగా బెలిజియా హోటల్‌కు మిత్రులు చేరుకున్నారని లాస్ వెగాస్ షూటింగ్ ఘటనను ప్రేమ్ వివరించాడు.
శుక్రవారం నుంచి లాస్‌వెగాస్‌లో ఉన్న జర్నలిస్టు ప్రేమ్ తన ఫేస్‌బుక్‌లోనూ అక్కడ తిరిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం లాస్ వెగాస్‌లో విమానాలను రద్దు చేశారు. అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు తెలుస్తున్నది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







