ప్రసాదం మాత్రమే తినే మొసలి
- October 03, 2017
భారత దేశం.. కర్మ భూమి.. ఆధ్యాత్మికానికి ఆశ్రమం.. ప్రకృతికి నిలయం అటువంటి మన దేశంలో కేరళలోని అనంతపురా ఒక అందమైన ప్రకృతి కలిగిన ప్రదేశం. మరి దీని విశిష్టత ఏమిటో తెలుసా..!
థాయిస్ లేక్ టెంపుల్.. ఇది కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని అనంతపురాలోని సరస్సు యొక్క సెంటర్ లో నిర్మించబడింది. ఇది భారత దేశంలో గల ఒక అద్భుతమైన గుడిలో ఒకటి. ఈ గుడి మనదేశం యొక్క ప్రత్యేకను తెలియజేస్తుంది. ఈ గుడిని దర్శించే ప్రతి భక్తుడు ఆశ్చర్యానికి లోనయ్యే విధంగా సుదరమైన సౌదర్యం.. అక్కడ చోటు చేసుకొనే ప్రతి సంఘటన.. ఆసక్తికరమైన చరిత్ర థాయిస్ లేక్ టెంపుల్ సొంతం.. ప్రతి ఒక్క సందర్శకుడు ఈ గుడికి వెళ్ళిన ప్రతిసారీ తనకు తెలియని ఏదోఒక వింతను గురించి తెలుసుకొంటాడు. ఈ అనంతపురా లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఐతే ఈ అనంతపురా కి ప్రధాన ఆకర్షణ.. లేక్ టెంపుల్ మరియు అక్కడ ఉండే ఒక మొసలి...
ఈ గుడి వద్ద ఉండే మొసలి... ప్రసిద్ది చెందింది.. ఈ మొసలి 60 ఏళ్ళకు పైనుంచి గుడికి కాపలాగా ఉంటుందట.. అక్కడ ఉండే స్థానిక ప్రజలు ఈ మొసలి గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెబుతుంటారు.. పూర్వకాలంలో శ్రీ విల్మంమంతల స్వామి అనే వ్యక్తి విష్ణు భక్తుడు.. విష్ణు దర్శనం కోసం తపస్సు చేసేవాడట. అతను తపస్సు ఆచరిస్తున్న సమయంలో ఒక చిన్నపిల్లవాడి రూపంలో కృష్ణుడు వచ్చి తపస్సుకి భంగం కలిగించాడట.. తన తపస్సు కు భంగం కలిగించేలా ప్రవర్తించిన చిన్న పిల్లవాడి తీరుతో విల్మంమంతల స్వామి తన ఎడమ చేతితో చిన్నబాలుడిని వెనక్కి నెట్టివేశాడు.. వెంటనే ఆ పిల్లవాడు పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి.. మాయమైపోయాడట. ఇదంతా చూసిన ఆ భక్తుడికి అసలు నిజం అర్ధం అయ్యింది అని అంటారు.. కృష్ణుడు అదృశ్యమైన ఆ గుహ ఇప్పటికీ అక్కడ కనిపిస్తుంది. ఇక మొసలి ఇప్పటి వరకూ చెరువులో ఉన్న చేపలతో సహా ఎవరికీ ఏవిధమైన హాని కలిగించలేదని లేక్ టెంపుల్ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఈ మొసలి ఆలయానికి ఒక కాపలాదారుగా వుంటుందట.. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒక మొసలి మరణిస్తే.. మరొక మొసలి ఆ సరస్సులో అద్భుతంగా దర్శనమివ్వడం.. గుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఈ మొసలి ని గౌరవిస్తారు.. 1945 లో ఈ సరస్సులో ఉన్న మొసలిని ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడట. అతను అనంతరం పాము కాటుకు గురై. మృతి చెందాడు.. ఇదంతా దేవుడి మహిమే అని.. పాము రూపంలో దేవుడు వచ్చాడని స్థానికుల కధనం.. అయితే ఇక్కడ మొసలి పూజారి పెట్టే ప్రసాదం మాత్రమే తింటుంది.. అదీ అన్నం.. బెల్లం కలిసిన ప్రసాదం మాత్రమే తింటుంది.. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇందంతా దేవుడి సృష్టిలో భాగమే కదా అని అనేవారెందరో..
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







