ట్రంప్ పై చట్ట పరమైన పోరాటం మొదలు పెట్టిన ముస్లింలు
- October 03, 2017
వాషింగ్టన్ : ట్రంప్ అమెరికా దేశాధ్యక్షుడు అయిన తరువాత ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్‌పై తొలిసారి ముస్లిం న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయం అమెరికా రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకమంటూ.. ఇరానియన్, అమెరికన్ ముస్లింల సమాఖ్య, లీగల్ ఇనిస్టిట్యూట్‌లు మేరీల్యాండ్.. న్యూయార్క్ ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించాక.. చట్ట పరమైన పోరాటం మొదలు కావడం ఇదే తొలిసారి. ట్రావెల్ బ్యాన్‌పై దాఖలైన దావాలపై.. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.
ట్రావెల్ బ్యాన్‌కు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సవరణలు చేస్తూ.. రెండు రోజుల కిందట తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం చాద్, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సిరియా, యెమన్, వెనుజులాకు చెందిన కొందరు ప్రభుత్వాధికారులు, వారి కుటుంబ సభ్యులపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 18 నుంచి అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







