రోడ్డుపై వెళుతూ మహిళపై కత్తి విసిరిన అరబ్ డ్రైవర్
- October 04, 2017
యూఏఈ రోడ్లపై టెయిల్‌గేటింగ్ సర్వసాధారణంగా మారిపోయింది. ఓ అరబ్ మోటరిస్ట్, ఓ మహిళ నడుపుతున్న వాహనాన్ని టెయిల్‌గేట్ చేయడమే కాకుండా, ఆమెపై కత్తిని విసిరిన ఘటన అల్ ధఫ్రా ప్రాంతంలో జరిగింది. నిందితుడు తన కారుని ఛేజ్ చేస్తున్న సమయంలో తాను గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాననీ, ఈ క్రమంలో అతను తన కారుని ర్యాష్‌గా ఓవర్‌టేక్ చేయడమే కాకుండా, తన మీదకు కత్తి విసిరాడని, ఆ కత్తి తన కారులోని సీట్‌పై పడి, కొంత మేర సీటు ధ్వంసమయ్యిందని బాధితురాలు ప్రాసిక్యూషన్‌కి వివరించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. న్యాయస్థానం నిందితుడియతీ 10,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. అయితే నిందితుడు, తనపై అక్రమంగా కేసులు బనాయించారని ఆరోపిస్తున్నాడు. తాను ఆ మహిళతో దురుసుగా ప్రవర్తించలేదనీ, కత్తి విసినానన్న ఆరోపణలూ నిజం కాదని అంటున్నాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







