మేథీ, కార్న్ పులావ్
- October 04, 2017
కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ - 2 కప్పులు, స్వీట్‌కార్న్- ఒక కప్పు, మెంతికూర- మూడు కట్టలు, టమాటాలు- రెండు, ఉల్లి పాయ- 1, పచ్చిమిర్చి- 2, కొత్తిమీర- ఒక కట్ట, ఉప్పు - తగినంత, పసుపు- చిటికెడు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరంమసాలా పొడి, లవం గాలు, చెక్క, షాజీర
తయారీ విధానం: బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె వేడిచేసి చెక్క, లవంగాలు, షాజీర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు నిలువుగా తరిగిన ఉల్లి, మిర్చి వేసి వేయించి టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు మెత్తగా ఉడి కిన తరువాత పసుపు, కారం, ఒక టేబుల్ స్పూన అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, తరి గిన మెంతికూర, స్వీట్‌కార్న్, ఒక టేబుల్ స్పూన గరం మసాలా పొడి వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలు వేయించి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేయాలి. నీరు మరిగినప్పుడు బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి అంతా పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







