మెడ భుజాలకు వ్యాయామం.. ఆకర్ణ ధనురాసనం
- October 04, 2017సాధారణంగా ఆఫీసుల్లో పని చేసేవారు కొన్ని గంటలపాటు ఒకే స్థితిలో కూర్చుని పని చేస్తుంటారు. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి మెడ భుజాల్లో కండరాలు పట్టేయటం, నొప్పులు లాంటి సమస్యలు ఉంటాయి. మెడ భుజాలకు సంబంధించిన బాధలు తరచుగా వస్తుంటాయి. ఈ భాగాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి. క్రమంతప్పకుండా వీటికి ఉపశాంతినిచ్చే ఆసనాలు, వ్యాయామం సాధన చేస్తుంటే దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. అలాంటిదే ఈ ఆకర్ణ ధనురాసనం.
రెండుకాళ్లూ దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. చేతులను భుజాల నుండి పక్కలకు చాపాలి. కుడికాలిని ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు చేతులను ముందుకు తీసుకువచ్చి కళ్లకు సమాంతరంగా ఉంచాలి. చేతుల పిడికిళ్లు బిగించి ఉంచాలి. తలని కుడికాలి వైపు తిప్పి ఉంచాలి.
ఇప్పుడు శ్వాస తీసుకుంటూ… బాణాన్ని లాగుతూ చేతిని వెనక్కు తీసుకుని వెళ్లినట్టుగా… ఎడమచేతిని వెనక్కు తీసుకుని వెళ్లి పిడికిలి చెవి దగ్గరకు వచ్చేలా ఉంచాలి. తలను కాస్త వెనక్కు వంచి కుడిచేతిని చూస్తున్నట్టుగా ఉంచాలి. ఇప్పుడు శ్వాసని వదులుతూ సాధారణ స్థితికి రావాలి. ఇలాగే చేతులను మార్చి చేయాలి.
ఈ ఆసనాన్ని తరచూ వేయడం వల్ల మెడ భుజాలకు వ్యాయామం కలుగుతుంది. ఆకర్ణ ధనురాసనం అలాంటి బాధలనుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం