తవాంగ్ దగ్గర కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్.. ఏడుగురు మృతి
- October 06, 2017
ఎయిర్ ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ రాష్ట్రంలోని తవాంగ్ దగ్గర కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మిలిటరీ అధికారులు, ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. మరో అధికారికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్యూ టీం గాయపడిన అధికారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉదయం 6 గంటలకు ఈఘటన జరిగింది. ఎమ్ఐ17 వీ5 హెలికాప్టర్ మంటలు చెలరేగి కుప్పకూలిపోయినట్లు ఆర్మీ ప్రకటించింది. 17000 ఎత్తులో హెలికాప్టర్ ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తవాంగ్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో, చైనా బార్డర్‌కు దగ్గర్లోని ప్రాంతం యాంగ్చీలో హెలికాప్టర్ కూలిపోయింది. ఎక్కువ ఎత్తులోనూ ప్రయాణించే, ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఉండే పవర్‌పుల్ ఇంజన్ ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. ఈ హెలికాప్టర్ పలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొన్నది. ఐఏఎఫ్.. ఎయిర్ ఫోర్స్ డే జరుపుకున్న ఒకరోజు తర్వాత ఈ ప్రమాదం జరగడం.. అది కూడా వివాదస్పద చైనా బార్డర్లో హెలికాప్టర్ కూలడంతో వెంటనే ప్రమాద ఘటన విచారణకు ఆర్మీ ఆదేశించింది.
గత వారం ఐఏఎఫ్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ హైదరాబాద్‌లోని కీసరలో కూలిపోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







