బుల్లి తెరపై అన్న రామ్ చరణ్‌ని బీట్ చేసిన తమ్ముడు వరుణ్ తేజ్
- October 06, 2017
మెగా బ్యాగ్రౌండ్ తో... ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా తమ సినిమాలను జాగ్రత్తగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు గ్యాప్ తీసుకునే మెగా హీరోలు బరిలో దిగారు. కానీ వెండితెర మీద పోటీ తప్పించుకుంటున్నా... బుల్లితెర మీద మాత్రం పోటీ తప్పలేదు. సెప్టెంబర్ 24న ఒకే టైమ్ లో ఇద్దరు మెగా హీరోల సినిమా పోటీగా ప్రసారం అయ్యాయి. ఆ సినిమాలే వరుణ్ తేజ్ నటించిన ఫిదా, రామ్ చరణ్ నటించిన ధృవ. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకొన్నాయి. కానీ బుల్లితెర మీద మాత్రం అన్న రామ్ చరణ్ మీద, తమ్ముడు వరుణ్ తేజ్ పై చేయి సాధించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేమకథాంశంతో వచ్చిన ఫిదాని చూసి. సిల్వర్ స్క్రీన్ మీద అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా హీరోయిన్ సాయిపల్లవికి యూత్ ఫిదా అయ్యింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రామ్ చరణ్ ధృవ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యింది. డీమానిటైజేషన్ ని తట్టుకుని మరి భారీ కలెక్షన్లు సాధించింది. సెప్టెంబర్ 24 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ మాటీవిలో ఫిదా టెలికాస్ట్ అయ్యింది. అదే రోజున సాయంత్రం 5 గంటలకు జెమినీ టివిలో ధృవ టెలికాస్ట్ అయ్యింది. ఈ రెండు సినిమాలకు రేటింగ్ చూస్తే... ఫిదాకి 15.77 రేటింగ్ వస్తే..ధృవకి 10.47 మాత్రమే రేటింగ్ వచ్చింది. అంటే రామ్ చరణ్ సినిమా కంటే వరుణ్ తేజ్ మూవీకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సో..బుల్లి తెరపై అన్నపై తమ్ముడు పై చేయి సాధించాడు..
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







