రైతులను సింగపూర్ తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
- October 08, 2017
రాజధానికి భూములిచ్చిన రైతులను సింగపూర్ తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న రైతుల నుంచి AP CRDA దరఖాస్తులు తీసుకొంది. మొత్తం 123 మంది రైతులు సింగపూర్ పర్యటనకు ఆసక్తి చూపించారు. అయితే 100 మందిని మాత్రమే తీసుకెళ్లాలనుకున్న ప్రభుత్వం... ఇవాళ లాటరీ ద్వారా వారిని ఎంపిక చేసింది. అయితే ఇంకా కేవలం 23 మంది మాత్రమే ఉండటంతో వారిని కూడా సింగపూర్ తీసుకెళ్లేందుకు సీఎం అనుమతి తీసుకుంటామన్నారు మంత్రి నారాయణ. ఈనెల 22 నుంచి మూడు విడతలుగా 100 మంది రైతులను సింగపూర్ కు తీసుకెళ్లనున్నారు. ఇక మిగిలిన వారిని నాలుగోవిడతలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు నారాయణ. సింగపూర్ ఎలా అభివృద్ది చెందింది. ఇక్కడ రైతులు తమ భూములను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చనే దానిపై అవగాహన కల్పించనున్నారు. అటు ఈనెల 12 నుంచి దర్శకుడు రాజమౌళి, సీఆర్డీఏ అధికారులు లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో డిజైన్లపై చర్చించనున్నట్లు నారాయణ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









