డైరెక్టర్ మారుతి బర్త్ డే సెలెబ్రేషన్స్
- October 08, 2017
యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో ఫ్యామిలీస్ ను ఇంప్రెస్ చెయ్యగల క్రియేటర్. కుటుంబ కథా చిత్రాలతోనూ కుర్రాళ్లను థియేటర్లకు రప్పించగల స్పెషలిస్ట్. లవ్ ఎంటర్టైనర్స్, హర్రర్ కామెడీస్, ఫ్యామిలీ స్టోరీస్ ఇలా అన్ని జానర్స్ ను పర్ఫెక్ట్ గా డీల్ చెయ్యగల భలే భలే దర్శకుడు అనిపించుకున్న మారుతి బర్త్ డే ఈరోజు...
ఏ దర్శకుడికైనా ఓ స్టైల్ ఉంటుంది. వాళ్లు ఆ ఫార్మాట్ లోనే ఎక్కువగా హిట్స్ కొడుతుంటారు. కానీ మారుతిని ఒకే ఇమేజ్ కు పరిమితం చెయ్యలేరు అని అతని జర్నీ స్పష్టంగా చెబుతుంది. యానిమేటర్ గా కెరీర్ మొదలు పెట్టి, కో ప్రొడ్యూసర్ గా ప్రేమిస్తే, ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని సినిమాలను పంపిణీ చేశాడు. తర్వాత ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు. ఈ ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ పాస్ చేసి తన మార్క్ చూపించాడు. ఆతర్వాత బస్ట్ స్టాప్ ను అదే ఫార్మాట్ లో తెరకెక్కించి యూత్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు.
మారుతి అంటే యూత్ ఫుల్ డైరెక్టర్ అనే ఇమేజ్ ను కొంచెం పక్కకుతీసుకెళ్లిన సినిమా ప్రేమ కథా చిత్రమ్. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో హార్రర్ కామిక్ గా వచ్చిన ఈసినిమా దెయ్యాల కథల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. సుధీర్ బాబు కు బెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈసినిమా కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచినా, ఈ దర్శకుడి ఇమేజ్ ను పూర్తిగా మార్చేసిన సినిమా భలే భలే మగాడివోయ్. మతిమరుపు మహారాజు పాత్రతో నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ సంపాదించి పెట్టిన ఈసినిమాతో మారుతి ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువయ్యాడు.
భలే భలే మగాడివోయ్ హిట్ తో ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ ను బాబుబంగారంగా చూపించి స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. వెంకీని బొబ్బిలి రాజాకి దగ్గరగా తీసుకెళ్లి విక్టరీ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేశాడు. అదే ఊపులో శర్వానంద్ ను ఓసిడి ఉన్న పరిశుభ్రమైన ఆనంద్ గా పరిచయం చేసి మరో హిట్ కొట్టాడు. ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ దర్శకుడు అనే ఇమేజ్ తెచ్చుకున్న మారుతి ఇప్పుడు నాగచైతన్యతో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతోంది ఈసినిమా. యూత్,ప్యామిలీస్ అందరికి నచ్చే సినిమాలు చేస్తోన్న మారుతి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకొందాం..!!
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







