హాకీ ప్లేయర్‌గా నటించబోతున్న తాప్సీ
- October 08, 2017
టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించినా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది తాప్సీ. అయితే బాలీవుడ్‌లో బాగానే కలిసి వచ్చింది ఈ అమ్మడికి. బాలీవుడ్ సినిమాలు సక్సెస్‌తో పాటు అవకాశాలను కూడా తెచ్చిపెడుతున్నాయి తాప్సీకి. ప్రముఖుల బయోపిక్‌లు తీయడంలో బాలీవుడ్ ముందుంటుంది. ఆ హవాని కొనసాగిస్తూ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవిత చరిత్ర తెరకెక్కించనుంది. ఈ పాత్రని దిల్జీత్ సింగ్ పోషించనున్నాడు. సందీప్ సింగ్ ప్రియురాలు కూడా హాకీ ప్లేయర్ కావడంతో ఆమె పాత్ర కోసం తాప్సీని ఎంపిక చేశారు. బయోపిక్‌లలో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఒరిజనల్ పాత్రకు న్యాయం చేయడం కోసం వంద శాతం ప్రయత్నిస్తుంటారు హీరో హీరోయిన్లు. ఇప్పుడు తాప్సీ కూడా తన పాత్రకోసం హాకీలో శిక్షణ తీసుకుంటోంది. ఈ సినిమా కూడా తనకి హిట్ తెచ్చిపెడుతుందని ఆశపడుతోంది. శిక్షణ తీసుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి అభిమానులతో షేర్ చేసుకుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







