విమానాశ్రయాల్లోకూడా ఆధార్, బయోమెట్రిక్
- October 09, 2017
ప్రస్తుతం దేశంలో ఆధార్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. పుట్టినప్పటి నుంచి పెన్షన్ వరకూ ప్రతి దానికీ ఆధార్ అనుసంధానమే. తాజాగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) త్వరలోనే ‘ఆధార్’తో ప్రయాణికులకు ప్రవేశం కల్పించనుంది. 2018 డిసెంబర్ నాటికి కేఐఏ పూర్తి స్థాయిలో ఆధార్, బయోమెట్రిక్‌లతో ప్రయాణికులకు ప్రవేశం కల్పించే విధంగా మారనుంది.
తద్వారా దేశంలోనే మొట్టమొదటి ఆధార్ ఆధారిత ఎయిర్‌పోర్ట్‌గా ఇదే కానుంది. ఆధార్ ద్వారా ప్రయాణికులకు ప్రవేశాన్ని కల్పించడం వల్ల వారు ప్రతి చెక్ పాయింట్‌లోనూ తమ గుర్తింపు కార్డులను చూపాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు బయోమెట్రిక్ ద్వారా ప్రయాణికులు ప్రవేశిస్తారు కాబట్టి సెక్యూరిటీలో కూడా ప్రయాణికులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేదని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సెక్యూరిటీ ప్రక్రియను పూర్తి చేసేందుకు 25 నిమిషాలు పడుతుంటే, కొత్త విధానం వచ్చాక ఇది పది నిమిషాలకే పరిమితమవుతుంది.
ఎయిర్‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి మరార్ దీనిపై మాట్లాడుతూ....‘ఆధార్, బయోమెట్రిక్‌ల వల్ల భద్రత కట్టుదిట్టమవుతుంది. తనిఖీలకు చాలాసేపు క్యూలలో నిలబడాల్సిన పని ఉండదు. అందువల్ల ప్రయాణికులు మరింత ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించగలరు. డిసెంబర్ 2018 నాటికి
ఈ విధానం అమల్లోకి రానుంది’ అని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







