కమెడియన్ అలీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు
- October 10, 2017
చిన్న వయసులోనే సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఎగిరాడు. తెలుగు తెరపై చాటంత హాస్యం పంచాడు. యమలీలకు తలొగ్గని నాయకుడిగా రాణించి, ఆడియన్స్ కు అక్కుంబక్కుం పంచినవాడు. తేడా పాత్రలకు పెట్టింది పేరుగా.. నచ్చిమీ డోంట్ టచ్ మీ అంటాడు. పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన న6టుడిగా.. పూరీ స్టోరీకి ముందే బుక్కయ్యే ఆర్టిస్ట్ గా తెలుగు తెరపై మూడు దశాబ్ధాలకు పైగా నవ్వులు పూయిస్తోన్న కాట్రవల్లి అలీ పుట్టిన రోజు ఇవాళ.
హాస్య నటుడిగా అలీకున్న ప్రధాన బలం.. టైమింగ్.. అండ్ ఎక్స్ ప్రెషన్స్.. వీటితో పాటు డైలాగ్ డెలివరీ. అందుకే బాలనటుడి నుంచి కౌమారానికి వచ్చే సంధి కాలంలో కాస్త ఇబ్బంది పడ్డా నూనూగు మీసాల టైమ్ లో కూడా వెండితెరపై రెచ్చిపోయాడు. ముఖ్యంగా ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో అలీ వేసిన పాత్రలు అంత ఈజీగా మర్చిపోలేం. అలీ జీవితంలో అద్భుతమైన క్షణం.. ఓ రోజు ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి వచ్చిన ఫోన్ కాల్. అతన్ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్టు ఎస్వీ చెప్పగానే ముందు నమ్మలేదు.. తర్వాత పదివేలు అడ్వాన్స్ చేతిలో పెట్టాక నమ్మక తప్పలేదు. కానీ కమెడియన్ హీరో అంటే ఎక్కడో అనుమానాలున్నా.. వాటన్నిటినీ తుడిచివేస్తూ.. అలీ హీరోగా నటించిన తొలి సినిమా యమలీల బాక్సాఫీస్ ను టాప్ హీరోల రేంజ్ లో షేక్ చేసింది.
ఓ పదేళ్ల క్రితం టాలీవుడ్ లో కొత్త కమెడియన్స్ హవా బాగా పెరిగింది. దీంతో అలీ స్థానం కదులుతందనుకున్నారు. కానీ పూరీ జగన్నాథ్ పరిచయంతో అలీ మళ్లీ టాప్ రేస్ లోకి వెళ్లిపోయాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన ప్రతి సినిమాలోనూ అలీకి ప్రధాన పాత్ర ఇచ్చేలా ప్రోత్సహించాడు. దీంత ఈ ఇద్దరి సినిమాలో అలీకి ఖచ్చితంగా చోటు ఉంటోంది. తేడా, లేడీ పాత్రలు వేయడంలో అలీ తర్వాతే ఎవరైనా అన్నంతగా ఆ పాత్రల్లో పాపులర్ అయ్యాడు అలీ. హిజ్రాగా అలీ చేసిన అన్ని పాత్రలూ దాదాపు నవ్వించాయి. అలాగే లేడీగా వేసిన సినిమాలూ నేచురల్ గా నవ్వించాయి. ప్రస్తుతం సినిమాలతో పాటు, కొన్ని టివి కార్యక్రమాలకూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అలీ ఫ్యూచర్ లో తెలుగు ప్రేక్షకులకు మరింత బాగా నవ్వించాలని కోరుకుంటూ ఈ నవ్వుల ఱేడుకు మరోసారి బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







