అక్టోబరు 31వ తేదీ నుంచి అమెరికాకు పాక్ విమాన సర్వీసులు రద్దు
- October 10, 2017
ఈ అక్టోబరు 31వ తేదీ నుంచి అమెరికాకు విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్టు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. భారీ నష్టాలే దీనికి కారణమని చెప్పింది. అమెరికాకు విమాన సర్వీసులను నడపడం వల్ల తమ సంస్థకు ఏటా రూ. 125 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. నష్టాలు భరించలేనంతగా తయారయ్యాయని. మరో దారి లేకే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. 1961లో అమెరికాకు సర్వీసులను స్రారంభించిన ఈ సంస్థ ,ప్రస్తుతానికి న్యూయార్క్ తో పాటు మరో మూడు అమెరికా నగరాలకు సర్వీసులను నడుపుతోంది. గతంలోనే అమెరికాకు సర్వీసులను నిలిపివేయాలని ఈ సంస్థ పలుమార్లు ప్రయత్నించి, రాజకీయ ఒత్తిడి వల్ల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







