ఒత్తిడి తగ్గించడానికి తినే ఆహారం

- November 03, 2015 , by Maagulf
ఒత్తిడి తగ్గించడానికి తినే ఆహారం

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో జీవనశైలి మరింత వేగవంతమైనది, ఆ వేగమే మనుష్యుల ఆరోగ్యం మీద ఎన్నో దుష్ప్రవాలను చూపుతున్నాయి. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టియోసల్ హార్మోన్లు లెవల్స్ పెరుగుతుంది. ఈ కార్టిసోల్ అనే హార్మోన్ వల్ల ఆకలి పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కార్బోహైడ్రేట్స్ మరియు స్వీట్స్ మీద ఎక్కువ కోరికలు పెరుగుతాయి. ఈ ఫుడ్స్ స్ట్రెస్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. తిరిగి వీటి వల్ల అధిక బరువు మరియు ఇతర సమస్యలు.... కాబట్టి, తినే ఆహారంలో సరైనదైతే ఒత్తిడి మరియు డిప్రెషన్ తగ్గించుకోవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక సైలెంట్ ట్రిక్ మంచి ఆహారాన్ని ఒత్తిడి తగ్గించే నేచురల్ ఆహారాన్ని తీసుకోవడమే. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఇతర ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి. ఇవి శరీరంలో అదనపు క్యాలరీల పెంచుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి కొన్ని నేచురల్ ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగింది. ఇవి స్ట్రెస్ ను తగ్గించడం మాత్రమే కాదు, ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. మరి ఆ ఆహారాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధకతను పెంచుతాయి. స్ట్రెస్ లెవల్స్ కు కారణం అయ్యే కార్టిసోల్ ను లెవల్స్ ను తగ్గిస్తాయి. అలాగే ఆరెంజ్ లో ఉండే ఆరోమా వాసన స్మూతింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి. ఒత్తిడి తగ్గించడానికి ఇది ఒక హెల్తీ ఫుడ్ మామిడిపండ్లు తినడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది. మరియు కంటి సమస్యలను నివారిస్తుంది. మామిడి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి హార్ట్ డిసీజ్ తో పోరాడుతుంది . స్కిన్ హెల్తీగా ఉంచుతుంది చేపల్లో ఉండే ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో సెరోటినిన్ లెవల్స్ ను పెంచుతుంది. ఈ హార్మోన్ స్ట్రెస్ లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు హార్ట్ డిసీజ్ తో పోరాడుతుంది. మరియు శరీరంలో ఆందోళన తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గించడానికి ఇది మరో హెల్తీ ఫుడ్. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా పాల కంటే చాక్లెట్ ఉత్తమమని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడి చేశారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కార్టిసోల్ లెవల్స్ తగ్గుతాయి.చాక్లెట్ తిన్న తర్వాత సంతోషానికి కారణం అయ్యే ఎండోర్ఫిన్ అనే హాపీ హార్మోన్ ను విడుదల చేస్తుంది. పిస్తాల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది.అనారోగ్యానికి కారణం అయ్యే ఒత్తిడిని తగ్గించడంలో పిస్తాలు గ్రేట్ గా పనిచేస్తాయి. హెల్తీ ఫుడ్స్ లో ఇది ఒక బెస్ట్ చాయిస్ . ఇది వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. పొట్టనింపుతుంది, బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది మరియు జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే సెరోటనిన్ అనే హార్మోన్ విడుదల అవ్వడం వల్ల ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆస్పరాగస్ లో ఫొల్లేట్ పుష్కలంగా ఉంది. ఇది మనస్సును ప్రశాంత పరుస్తుంది. అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది దీన్ని ఆవిరిలో ఉడికించినప్పుడు మరింత ఆరోగ్యకరం . కాబట్టి, డైలీ డైట్ లో చేర్చుకోవాలి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com