కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య ఇంట్లో అగ్నిప్రమాదం: నలుగురి మృతి
- November 03, 2015
మాజీ ఎంపీ, వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయన కోడలు సారికతో పాటు మనవళ్లు అభినవ్(7), అమోన్(3), శ్రీయోన్(3)లు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రాజయ్యతో పాటు ఆయన కుమారుడు అనిల్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, ఏఎస్పీ జానయ్య ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసు జాగిలాల సాయంతో ఆధారాలకోసం ప్రయత్నిస్తున్నారు. రాజయ్య నివాసంలోని మొదటి అంతస్థులో ప్రమాదం జరిగింది. మొదటి అంతస్థు నుంచి ఉదయం 6.30గంటల వరకు కూడా పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కోడలు సహా ముగ్గురు మనువళ్లు మృతిచెందడంతో రాజయ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తాజా వార్తలు
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!







