రోడ్లు అభివృద్ధి చేయడానికి టోలు పన్ను

- October 10, 2017 , by Maagulf
రోడ్లు అభివృద్ధి చేయడానికి టోలు పన్ను

కువైట్ : రహదారుల రద్దీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కొన్ని రహదారులను ఉపయోగించినందుకు టోలు రుసుము వసూలు చేయాలని అధ్యయనంలో వెల్లడి కాబడినట్లు  పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వశాఖలోని రహదారుల శాఖ సహాయ కార్యదర్శి అహ్మద్ అల్-హసన్ మంగళవారం పేర్కొన్నారు. ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దీంతో ప్రత్యామ్నాయ రహదారులు ఉచితంగా లభిస్తాయని ఆయన తెలిపారు .నూతన రహదారుల ప్రాజెక్టులు ఈ ప్రణాళికలో అనేక రహదారులను తెరవనున్నట్లు వివరించారు. జమాల్ అబ్దుల్ నస్సేర్ రహదారి పశ్చిమ భాగాలను పూర్తి చేస్తామని ఆయన ధృవీకరించారు.  ఇది వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రారంభించబడనుంది.అదేవిధంగా సమీప భవిష్యత్తులో 26 రోడ్డు ప్రాజెక్టులను అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com