కమెడియన్ సంతానం కోసం పోలీసుల వేట
- October 11, 2017
కమెడియన్ సంతానం కోసం చెన్నై పోలీసులు వేట మొదలుపెట్టారు. ఇండస్ర్టీలో హాస్యనటుడిగా అంచెలంచెలుగా ఎదిగిన
సంతానం కోసం పోలీసులు గాలింపు ఏంటి? అసలు స్టోరీలోకి వెళ్తే.. కమెడియన్ సంతానం.. ఓ కాంట్రాక్టర్తో కలసి
కుండ్రత్తూర్ సమీపంలోని కల్యాణ మండపం నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందులో తన భాగం మొత్తానికి
సంబంధించిన డబ్బును నిర్మాణానికి ముందే ఇచ్చేశాడు సంతానం. ఐతే, నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య అభిప్రాయ
భేదాలు రావడంతో వైదొలిగడం, కాంట్రాక్టర్ కొంత డబ్బు తిరిగి సంతానంకు చెల్లించాడు.
మిగతా మొత్తాన్ని ఇవ్వకుండా సదరు కాంట్రాక్టర్ తప్పించుకోవడంతో మేనేజర్ రమేష్ తో కలిసి సంతానం నేరుగా ఆయన కార్యాలయానికి వెళ్లడం, ఆపై వాళ్ల మధ్య మాటామాటా పెరిగి చివరకు ఘర్షణకు దారితీసింది. ఆ గొడవలో ముగ్గురు గాయపడ్డారు. నటుడు సంతానంపై స్థానిక స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ఐతే, విచారణ నిమిత్తం సంతానంను సంప్రదించడానికి పోలీసులు ప్రయత్నించారు.. ఐనా ఫలితం లేకపోయింది..
దీంతో రేపోమాపో సంతానంను అరెస్ట్ చేయడం ఖాయమంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు సంతానం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







