వీసా దరఖాస్తు, రెన్యువల్: మున్సిపల్ సెంటర్ వద్దనే
- October 11, 2017
వీసా, రెసిడెన్సీ ట్రాన్సాక్షన్స్, మున్సిపల్ సర్వీసెస్ అన్నీ ఒకే చోట లభించేలా వన్ స్టాప్ సెంటర్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, రెండో అమెర్ సెంటర్ని ప్రారంభించారు. దుబాయ్ మునిసిపాలిటీ అల్ కిఫాఫ్ సెంటర్ వద్ద ఈ సెంటర్ ఏర్పాటయ్యింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) నిర్వహణలో ఈ సెంటర్స్ పనిచేస్తాయి. మే నెలలో ముహైసినా ప్రాంతంలో 30 ఎమెర్ బిజినెస్ సెంటర్స్ ప్రారంభమయ్యాయి. క్రమంగా వీటి సంఖ్య ఎమిరేట్ వ్యాప్తంగా 600కి చేరుకుంటోంది. జిడిఆర్ఎఫ్ఎ దుబాయ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మెర్రి మాట్లాడుతూ, దుబాయ్ మునిసిపాలిటీలో ఎమెర్ సెంటర్ ప్రారంభించడం ద్వారా సంబంధిత సేవలు మరింత సులువుగా, ఒకే చోట లభించడానికి వీలవుతుందని తెలిపారు. మునిసిపల్ సర్వీసులు, అకామడేషన్ సర్వీసులు, రెసిడెన్సీ పర్మిట్స్, రెసిడెన్సీ రెన్యువల్స్, రెసిడెన్స్ క్యాన్సిలేషన్, న్యూ పాస్పోర్ట్ - చేంజ్ ఆఫ్ రెసిడెన్స్, షార్ట్ మరియు లాంగ్ విజిట్ వీసా సర్వీసులు ఎమెర్ ద్వారా పొందడానికి వీలుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







