4 నెలలపాటు షార్జా రింగ్‌రోడ్ పాక్షికంగా మూసివేత
- October 11, 2017
ఇండస్ట్రియల్ ఏరియా 17 వద్ద షార్జా రింగ్ రోడ్‌ని వినియోగించే మోటరిస్టులు, ఈ ప్రాంతంలో ముందు ముందు ఏర్పడే ట్రాఫిక్ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్టీరియల్ రోడ్డు నాలుగు నెలలపాటు పాక్షికంగా మూసివేయనుండడమే దీనికి కారణం. మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, ఈ రోడ్డుని పాక్షికంగా నాలుగు నెలలపాటు మూసివేయడానికి నిర్ణయించుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మినిస్ట్రీకి చెందిన రోడ్స్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, అక్టోబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రోడ్డు మూసివేయబడ్తుందని చెప్పారు. రోడ్డు మూసివేత కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, హెచ్చరిక బోర్డులను పరిగణనలోకి తీసుకుని వాహనాలను నడపాలని సూచించారు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకుగాను, ప్రాజెక్ట్ విస్తరణ పనుల కోసం ఈ మూసివేతను అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







