ఎగ్రెసివ్ హీరో గోపిచంద్కు 'ఆక్సిజన్' లైఫ్ ఇస్తుందా....

- October 11, 2017 , by Maagulf
ఎగ్రెసివ్ హీరో గోపిచంద్కు 'ఆక్సిజన్' లైఫ్ ఇస్తుందా....

ఎగ్రెసివ్ హీరో గోపిచంద్ లేటెస్ట్ మూవీ ఆక్సిజన్. ఎ.ఎమ్.రత్నం సమర్పణలో జ్యోతికృష్ణ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ మాస్ హీరోకి జోడీగా రాశీఖన్నా, అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. గోపిచంద్ ఎగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఈ ఇద్దరి గ్లామర్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతుంది. ఇక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది.

ఆక్సిజన్ మూవీ ఈ నెల 27న విడుదలవుతోంది. గత చిత్రాలు నిరాశపరచడంతో ఇప్పుడు ఆక్సిజన్ మూవీకి స్పెషల్ గా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేశాడు గోపిచంద్. ఒక్కో సాంగ్ ని రీలీజ్ చేస్తూ ఇంట్రెస్ట్ పెంచుతున్న ఆక్సిజన్ టీమ్, ఈ నెల 15న ఆడియో ఫంక్షన్ నిర్వహించబోతుంది. అభిమానుల మధ్య నెల్లూరులో ఆడియోని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆక్సిజన్ మూవీ గోపిచంద్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com