హైదరాబాద్ శంషాబాద్లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన
- October 11, 2017
ఓలా, ఉబర్ సంస్థలను నిషేధించి తమను ఆదుకోవాలంటూ.. క్యాబ్ డ్రైవర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నడుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. డ్రైవర్ల ఆందోళనలతో ఎయిర్పోర్ట్ దగ్గర ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
ఎన్నో ఆశలు కల్పించి.. తమతో కార్లు కొనిపించిన క్యాబ్ కంపెనీలు.. ఇప్పుడు ట్రిప్పులను సక్రమంగా కేటాయించలేదంటూ ఆరోపించారు డ్రైవర్లు. ఫైనాన్స్ డబ్బులు కట్టలేక.. కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం క్యాబ్ కంపెనీలు కేవలం 5 శాతం మాత్రమే ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నాయని.. యాప్ రూపొందిస్తే.. తాము పది శాతం పన్ను కడతామంటూ చెప్పారు డ్రైవర్లు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







