హీరోయిన్గా ఛాన్స్ కావాలంటే పడక గదికి రమ్మంటున్నారు : రాధికా ఆప్టే
- October 12, 2017
మళయాళీ నటి భావన లైంగిక వేధింపులు ఎదుర్కున్నానంటూ వార్తల్లో ఎక్కినప్పటినుంచీ వరుసగా సినిమా నటీమణులు ఇండస్ట్రీలో తమకు జరిగిన అవమానాలు, తాము ఎదుర్కున్న లైంగిక వేధింపులను ఏకరువు పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి హీరోయిన్ కస్తూరి కూడా ఓ హీరో నుంచి ఇలాంటి వేధింపులే ఎదుర్కున్నానని, అతడికి నో చెప్పడంతో సినిమా అవకాశాలు పోయాయని చెప్పింది. ఇక బాలీవుడ్లో కాంట్రావర్సీలకు కేంద్ర బిందువుగా నిలిచే రాధికా ఆప్టే తెలుగులో బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో నటించింది. తమిళం కబాలీలో రజనీకాంత్ భార్యగా నటించి మెప్పించింది. ఫ్రీ పబ్లిసిటీని కోరుకునే రాథిక ఆప్టే తాజాగా మరోసారి దక్షిణాది ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. పరిశ్రమలో హీరోయిన్లను బెడ్ రూముకు పిలిచే సంప్రదాయం ఉందని చెప్పుకొచ్చింది. తననను కథా చర్చలకు రమ్మని ఓ నిర్మాత పిలిచి పడక గదికి రమ్మంటే తాను అంగీకరించలేదని, ఈ కారణంగానే తనకు దక్షిణాదిలో ఎక్కువగా అవకాశాలు రాలేదని అంటోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







