అభిమానిని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి చేసిన మమ్ముట్టి
- October 12, 2017
మళియాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న హీరో మమ్ముట్టి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన మమ్ముట్టి షూటింగ్ సమయాల్లో తప్ప సాధారణ జీవితంలో చాలా సింపుల్ గా ఉంటారని టాక్. తాజాగా మమ్ముట్టి ఓ వీరాభిమాని కోరిక తీర్చి ఎంతో సంతోష పెట్టారు. తమకు నచ్చిన హీరోతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడతారు. షెడ్యూల్ బట్టి హీరోలు అభిమానులకు సమయం కేటాయించవచ్చు.. ఒక్కోసారి కేటాయించకపోవచ్చు.
తాజాగా కేరళలోని వయనాడ్ ప్రాంతానికి చెందిన ఆదివాసి..ఒక్కసారే తన ఎదురుగా ఎంతో అభిమానించే హీరో మమ్ముట్టి కనబడటంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. నటుడు మమ్ముట్టి అంటే అతడికి ఎంతో ప్రాణం. ఓ చిత్రం షూటింగ్ కోసం మమ్ముట్టి వయనాడ్‌కి వెళ్లాడు. ఎలాగైనా తన అభిమాన నటుడితో ఓ ఫోటో తీయించుకోవాలని ప్రయత్నం చేశాడు.
అప్పుడే ఆ దారిలో వస్తున్న బెంజ్ కారుకు ఎదురుగా వెళ్లి ఆపి ఇందులో మమ్ముట్టి సార్ ఉన్నాడా? అని అడిగాడు.కారులో ఉన్నవారు ఎవరు నువ్వు అనగానే.. తాను హీరో మమ్ముట్టి అభిమాని అని బాలన్ సమాధానమిచ్చాడు. వెంటనే ముందు సీట్లో కూర్చున్న మమ్ముట్టి అద్దం కిందికి దించి బాలన్ వైపు చూసి నవ్వాడు.
దాంతో బాలన్‌కి నోటమాట రాలేదు. మమ్ముట్టి.. అతడ్ని ఆప్యాయంగా పలకరించి అన్ని విషయాలు అడిగి తెలుసు కోవడం పక్కనున్న వారితో ఓ ఫోటో తీయమని చెప్పాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







