'ఎమిరేట్స్' గ్రూపు తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు
- October 12, 2017
విజయవాడ : అమరావతి, విశాఖలను ఎయిర్‌లైన్స్ హబ్‌గా చేసుకోవాలని దుబాయ్ 'ఎమిరేట్స్' గ్రూపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమిరేట్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్-దుబాయ్ మధ్య విమాన సర్వీసులు పెంపు, అమరావతి-విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం వంటి తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు 'ఎమిరేట్స్' గ్రూప్ ఎయిరోపొలిటికల్ ఎఫైర్స్ డివిజినల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అద్నాన్ ఖాజిమ్ సానుకూలంగా స్పందించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కార్యదర్శి ఎం. గిరిజా శంకర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి రఘు, పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







