చేప ఇగురు పులుసు
- October 12, 2017
కావలసిన పదార్థాలు: చేపలు - ఒక కేజీ, చింతపండు -రెండు నిమ్మకాయలంత, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిరపకాయలు- 5, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు - ఒక స్పూన్, గరంమసాలా - అరస్పూన్, మిరపపొడి - ఒకస్పూన్, ఉప్పు -తగినంత, పెరుగు- రెండు స్పూన్‌లు, బెల్లం పొడి- అర స్పూన్, పసుపు- తగినంత, పోపు దినుసులు- కావలసినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా చేపముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తరువాత ముల్లు తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు, పసుపు వేసి కలుపుకోవాలి. అందులో చింతపండు పులుసు పోసి మిరపపొడి, పెరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తరువాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







