విజయవాడలో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు

- October 14, 2017 , by Maagulf
విజయవాడలో సీఎం  చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు

నగరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసు కంట్రోల్‌ రూమ్‌ కూడలి వద్ద చంద్రబాబు కాలినడకన పరిశీలించారు. వ్యర్థాలతో రూపొందించిన పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బందరు కాల్వను ఆనుకుని పచ్చదనం పెంపు కార్యాక్రమాన్ని పరిశీలించారు. విజయవాడ పాత బస్టాండ్‌ లోపలికి వెళ్లి అక్కడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాతబస్టాండ్‌ వద్ద పార్క్‌ను పరిశీలించి అక్కడ వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్‌పేట బస్‌డిపోను సీఎం పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com