సౌర వ్యవస్థలో కనిపించని ఓ సూపర్ ఎర్త్.. ప్లానెట్–9
- October 14, 2017
సౌర వ్యవస్థలో ఉనికిలో ఉందని భావిస్తున్న ప్లానెట్–9 గ్రహానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహం బరువు భూమి కంటే 10 రెట్లు ఎక్కువగాను, సూర్యుడి నుంచి నెప్ట్యూన్ కంటే 20 రెట్లు దూరంలోనూ ఉన్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. కనిపించకుండా దోబూచులాడుతున్న ఈ ప్లానెట్–9 గ్రహాన్ని కనపించని ఓ సూపర్ ఎర్త్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణించారు.
అయితే బరువులో మంచు గ్రహాలైన యూరేనస్, నెప్ట్యూన్ కంటే ప్లానెట్–9 గ్రహం బరువు తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహ ఉనికికి సంబంధించి ఇప్పటివరకు సరైన ఆధారాలు లేవని, అయితే ప్రస్తుతం ఆ గ్రహ ఉనికిని తెలిపే 5 పరిశీలనాత్మక ఆధారాలు లభించాయని అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్లానెటరీ ఆస్ట్రోఫిజియిస్ట్ కాన్స్టాంటిన్ బాజిన్ వివరించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్







