ఢిల్లీ వెళ్ళిన ఏ పి ముఖ్యమంత్రి

- November 04, 2015 , by Maagulf
ఢిల్లీ వెళ్ళిన ఏ పి ముఖ్యమంత్రి

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏపీ భవన్‌లో జరిగిన కీలక భేటీల్లో చంద్రబాబు పాల్గొన్నారు. బుధవారం ఉదయం సైన్స్ అండ్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయరాఘవన్‌, సీఎంను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో బయోటెక్నాలజీ సంస్థల ఏర్పాటుపై చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనాచౌదరి కూడా పాల్గొన్నారు. అనంతరం మాజీ డీజీపీ స్వరణ్‌జిత్‌ సేన్‌ ఆధ్వర్యంలో ఫిక్కి ప్రతినిధులు ఏపీ సీఎంతో సమావేశమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com