జయప్రద నిజంగానే భయపెట్టేస్తోంది
- October 15, 2017
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడంతా హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా భారీ నిర్మాణ సంస్థలన్నీ చారిత్రాత్మక చిత్రాల నిర్మాణంపై దృష్టి పెడుతూ.. అంతే భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడదే కోవలో రాబోతోన్న చిత్రం "సువర్ణ సుందరి". చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుందనేది ట్యాగ్ లైన్. సూర్య దర్శకత్వంలో ఎస్. టీమ్ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్.ఎల్.లక్ష్మి 'సువర్ణ సుందరి'ని తెరకెక్కిస్తోన్నారు.
అలనాటి మేటి నటిమణి జయప్రద ఓ కీ రోల్ పోషిస్తుండగా, ఈ పాత్రకు ఓ ప్రత్యేకత ఉందని, గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రద గారి పాత్ర ఉంటుందన్నారు దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్. ఇక పూర్ణకు కూతురుగా జయప్రద నటిస్తుండటంతో పాటు, వారిద్దరి మధ్య ఉండే ఎమోషన్ ఈ సినిమాకు ఓ హైలెట్ అవుతుందని చెబుతున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన జయప్రద లుక్‌ని కూడా విడుదల చేశారు. ఈ లుక్‌లో జయప్రద నిజంగానే భయపెట్టేస్తోంది. పతాక సన్నివేశాల్లో డూప్ లేకుండా కష్టపడి, ఇష్టపడి జయప్రద గారు చేసిన స్టంట్స్ సువర్ణ సుందరి విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఇటీవలే వీటికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తెలుపుతున్నాడు దర్శకుడు.
జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు ఇందులో ఇతర తారాగణం.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







