అనప బర్ఫీ

- October 15, 2017 , by Maagulf
అనప బర్ఫీ

కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము- 1/2 కేజీ, నెయ్యి- 1 టేబుల్‌ స్పూను, పంచదార- 3/4 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, బాదం తురుము- 4 టీ స్పూన్లు, పచ్చి కోవా/పనీర్‌/కాటేజ్‌ చీజ్‌- 1/4 కేజీ
తయారీ విధానం: బాణలిలో నెయ్యి వేడి చేసి సొరకాయ తురుమును వేసి వేగించాలి. పదార్థం నుంచి నీరు విడుదలవుతుండగా పంచదార వేసి బాగా కలపాలి. మంట మధ్యస్థంగా ఉంచి నీరంతా ఆవిరి అయ్యే వరకూ కలుపుతూ వేగించాలి. తరువాత పనీర్‌/ కోవా/ కాటేజ్‌ చీజ్‌ల్లో ఏదో ఒక దానిని వేసి కావాలనుకుంటే గ్రీన ఫుడ్‌ కలర్‌ కూడా వేసుకుని బాగా కలిపి మరో ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. ఆ తరువాత యాలకుల పొడి, బాదం తురుము వేసి కలిపి పదార్థాన్నంతా నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరచి ఆరిన తరువాత ముక్కలు కోయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com