గుండెజబ్బుతో బాధపడేవారు.. రోజూ జామపండును తీసుకుంటే?
- October 15, 2017
గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుంది.
ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చును. పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఇందులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది. పచ్చి జామకాయ ముక్కలను కప్పెడు తీసుకొని, బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైందవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడడమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.
బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలకు, గర్భిణులకు దీనిని టానిక్‌లా వాడవచ్చు. జామపండులో సి-విటమిన్ అధికంగా ఉండడంతో చర్మానికి మేలు చేస్తుంది. వీటితో పాటు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. విటమిన్-ఏ అధికంగా ఉండే జామపండుతో కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







