సికింద్రాబాద్ స్టేష్‌న్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 4,532 కిలోల నగల స్వాధీనం
- October 15, 2017
రసీదులు లేకుండానే ముంబయ్, కర్ణాటక, ఢిల్లీ తదితర నగరాలకు బంగారు నగలు రైళ్ల ద్వారా పెద్దమొత్తంలో సరఫరా అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైలు సికింద్రాబాద్ స్టేష్‌న్‌కు చేరుకోగానే తనిఖీలు చేసి 4,532 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ అమృత్‌సర్‌కు చెందిన కన్నా రాజేష్(50), జగ్‌మోహన్ సింగ్(35) బంగారు వ్యాపారులు. ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 8న బయల్దేరిన రాజధాని సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్-5, 2ఏసీ బోగీలో ప్రయాణించారు.
10వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ప్లాట్ ఫారం నెంబర్ పదిలో ఆగింది. అప్పటికే పోలీసులకు రైలులో బంగారం తరలిస్తున్నారని సమాచారం అందడంతో జీఆర్‌పీ ఎస్‌ఐలు ప్రమోద్‌కుమార్, నాగేశ్వర్‌రెడ్డి, ఎస్పీ ఎస్సై కృష్ణారావు, రైల్వే ఎస్‌బీ కానిస్టేబుల్ శంకర్‌తోపాటు ఐదు బృందాలు ఏసీ బోగీలో తనిఖీ చేశారు. బెర్తు 43, 45లో ఉన్న ఇద్దరికి సంబంధించిన బ్యాగుల్లో 4,532 కిలోల బంగారు నగలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరినీ రైల్వే పోలీస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. 1.9 కిలోల బంగారు ఆభరణాలకు మాత్రమే బిల్లులు ఉన్నాయి.
మిగతా వాటికి లేకపోవడంతో వారిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







