బాలీవుడ్ డైరెక్టర్ లేఖ్ టాండన్ ఇకలేరు
- October 16, 2017
బాలీవుడ్ 'బాద్షా' షారుఖ్ ఖాన్ ను ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ లేఖ్ టాండన్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ముంబయిలో తుదిశ్వాస విడిచారు. 1988లో టాండన్ దర్శకత్వం వహించిన 'దిల్ దరియా' అనే ధారావాహికలో షారుక్‌కి అవకాశం ఇచ్చి బుల్లితెరకు పరిచయం చేసాడు.
ఈ సీరియల్‌తో షారుక్‌కి మంచి గుర్తింపు రావడంతోనే సినిమాల్లో అవకాశం వచ్చింది. టాండన్ హిందీలో 'ఆమ్రపాలి', 'దుల్హన్ వాహీ జో పియా మన్ భాయే' తదితర చిత్రాలు తెరకెక్కించి మంచి గుర్తింపు పొందాడు..టాండన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, రిషి కపూర్, రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ తదితరులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







