ప్లానెట్-9 ఆధారాలు లభించాయన్న నాసా శాస్త్రవేత్తలు
- October 16, 2017
భూమికన్నా 10 రెట్ల బరువు ఉండొచ్చని అంచనా వాషింగ్టన్, అక్టోబర్ 16: మన సౌరకుటుంబంలో సూపర్ ఎర్త్ ఉనికి నిజమేనని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది భూమి కన్నా 10 రెట్ల బరువు ఉండొచ్చని, సూర్యుడు-నెప్ట్యూన్ మధ్య దూరం (450 కోట్ల కి.మీ.) కన్నా 10 రెట్ల దూరంలోని (4,500 కోట్ల కి.మీ.) కక్ష్యలో తిరుగుతుండొచ్చని అంచనా వేస్తున్నారు. మన సౌర కుటుంబం అంచుల్లోని చీకటి ప్రదేశంలో భారీ గ్రహం ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. దీనికి ప్లానెట్-9 అని పేరు పెట్టారు. దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా గ్రహం ఉనికికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లభించలేదు. తాజాగా సూపర్ ఎర్త్‌కు సంబంధించి ఐదు పరిశీలనాత్మక ఆధారాలు లభించాయని అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు కాంస్టంటిన్ బటైజిన్ తెలిపారు.
గ్రహం బరువు, కక్ష్యకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరికాయన్నారు. ఐదు ఆధారాలను విశ్లేషించి చిక్కుముడి విప్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నెప్యూన్ గ్రహం తర్వాత సౌరకుంటుంబం చివరి వరకు ఉన్న ప్రదేశాన్ని క్యూపియర్ బెల్ట్ అంటారు. ఇందులో ఆరు భారీ ఖగోళ వస్తువులు, గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు.
ఆ ఖగోళ వస్తువుల తర్వాత క్యూపియర్ బెల్ట్ అంచుల్లో సూపర్ ఎర్త్ ఉండొచ్చని అంచనాకు వచ్చారు. ఇది మిగతా గ్రహాలతోపాటే 45 కోట్ల ఏండ్ల కిందటే పుట్టి ఉండొచ్చన్నారు. ప్లానెట్-9ను గుర్తించగలిగితే సౌరకుటుంబానికి సంబంధించిన పలు చిక్కుముడులు వీడుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పరిశోధన వ్యాసం ఆస్ట్ట్రనామికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







