పోలీస్ శిక్షణ కేంద్రంపై ఆత్మాహుతి దాడి, 61 మంది మృతి
- October 17, 2017
అఫ్గానిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పక్తియా ప్రావిన్స్ లోని గార్డెజ్ ప్రాంతంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని పోలీస్ శిక్షణ కేంద్రంపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు.
ఈ దాడిలో 61మంది మృతిచెందగా, మరో 160 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పోలీసులతో పాటు మహిళలు, విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని.. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని, మిగిలిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
మంగళవారం ఉదయం భద్రతావలయాన్ని దాటుకుని వచ్చిన ఉగ్రవాదులు ఈ శిక్షణ కేంద్రంలోకి చొరబడ్డారు. రెండు కార్లతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు ముష్కరులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. మరోవైపు ఘటనకు పాల్పడింది తామేనంటూ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ట్విటర్ ద్వారా ప్రకటించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







