డిసెంబర్ లో రిలీజ్ కానున్న సల్మాన్ 'టైగర్'
- October 18, 2017
సల్లూభాయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'టైగర్ జిందా హై' ఫస్ట్‌లుక్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా సల్మాన్ లుక్‌ని ట్విటర్ ద్వారా విడుదలచేశాడు. ఇందులో సల్మాన్ గన్ను పట్టుకుని కోపంగా చూస్తున్న స్టిల్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
ఫస్ట్‌లుక్‌పై 'దెబ్బతగిలిన పులిలా ఎవ్వరూ వేటాడలేరు' అని రాసున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఇందులో భాయ్‌కి జోడీగా కత్రినా కైఫ్ నటిస్తోంది. 2012లో వచ్చిన 'ఎక్ థా టైగర్'కి ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ కోసం సల్మాన్, కత్రినా గ్రీస్ వెళ్లనున్నారు. ఈ ఏడాది 'ట్యూబ్‌లైట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్‌కి నిరాశే మిగిలింది. మరోపక్క కత్రినాకి కూడా 'జగ్గా జాసూస్' చిత్రం విజయం అందించలేదు. దాంతో వీరిద్దరూ ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







