కారులో సిగరెట్ ముట్టించడంతో చుట్టుముట్టిన మంటలు, ముగ్గురికి తీవ్ర గాయాలు

- October 18, 2017 , by Maagulf
కారులో సిగరెట్ ముట్టించడంతో చుట్టుముట్టిన మంటలు, ముగ్గురికి తీవ్ర గాయాలు

యూఏఈ : గ్యాస్ ఆధారంగా పరిగెత్తే కారులో ఉన్నామనే సంగతి విస్మరించిన ఓ యువకుడు సిగరెట్ లైటర్ వెలిగించి విలాసంగా సిగరెట్ అంటించి పొగను గుండెల నిండా పీల్చుకొని వెలుపలకు పొగ వదిలేలోపు పెద్ద ఉపద్రవం జరిగిపోయింది. వాహనం లోపల ఒక్కసారిగా భగ్గుమని మంటలు చుట్టిముట్టేయి. మంగళవారం షార్జా వాసిట్ ప్రాంతంలో పార్కింగ్ స్థలం వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఎమిరాటీ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలియగానే ప్రమాద స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడ 14 ఏళ్ళు ..16 ఏళ్ల వయస్సులో ఉన్న ఇద్దరు యువకులను, కారులో  26 ఏళ్ల వ్యక్తి చిక్కుకొన్న మరో వ్యక్తిని ఘటనా స్థలంలో కనుగొన్నారు.అగ్నిజ్వాలల ధాటికి  ఆ కారు అద్దాలను పూర్తిగా దెబ్బతిన్నాయి. మంటలలో చిక్కుకొన్న యువకుల్లో ఒకరికి ద్వితీయ స్థాయిలో కాలిన గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అల్ ఖాసమి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై  ఒక సీనియర్ పోలీస్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో  మాట్లాడుతూ, గ్యాస్ కిట్ నుండి సహజవాయువు వెలుపలకు విడుదల కావడం కారులోపల అద్దాలను మూసివేసిన నేపథ్యంలో ఓ యువకుడు సిగరెట్ ముట్టించడం కోసం లైటర్ తో అగ్నిని మండించడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. తల్లితండ్రులు తమ తమ పిల్లల వ్యవహార శైలిని పర్యవేక్షించాలని అలాగే వారి భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com