దీపావళి నాడు దీపాలు ఎక్కడ వెలిగించాలి?

- October 18, 2017 , by Maagulf
దీపావళి నాడు దీపాలు ఎక్కడ వెలిగించాలి?

దీపావళి నాట ఏ ఇంట సమృద్ధిగా దీపాలు వెలుగుతాయో.. ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీ దేవి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి పుణ్యదినమైన దీపావళి రోజున సాయం ఏ సమయంలో దీపాలు పెట్టాలి? ఎక్కడ పెడితే మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది..?

దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఆ లక్ష్మీదేవిని అదే దీపాల వెలుగులో మన ఇంటికి ఆహ్వానించుకోవాలి. అలా చేయాలంటే.. సరైన సమయంలో.. సరైన పద్ధతిలో.. సరైన స్ధానంలో దీపాలను వెలిగించాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆనందంగా మీ ఇంటి తలుపు తడుతుంది. మిమ్మల్ని కటాక్షిస్తుంది

దీపావళి నాడు.. మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల హారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.  సాయంత్రం వేళ లక్ష్మీస్వరూపమైన తులసికోట దగ్గర ముందుగా దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరశతనామాలతో ఆ దేవిని శక్తివంతురాలుగా భావించి, నివేదన చేసి, పూజ చేయాలి. గృహమంతా దీపాల కాంతుల్లో నిండిపోవడం వల్ల మహాలక్ష్మి సంతోషంగా  మీ ఇంట ప్రవేశిస్తుందని చెప్తారు. అందుకే.. దీపావళి రోజున శుచిగా స్నానం చేసి పూజాకార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మాత్రమే దీపాలు వెలిగించాలని పురోహితులు అంటున్నారు. 

వెలిగించే దీపాలు మాత్రం ఖచ్చితంగా బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. ఎట్టిపరిస్ధితుల్లోనూ సరిసంఖ్యలో దీపాలను వెలిగించకూడదని చెప్తారు. ఆ దీపాల్లో నువ్వుల నూనె వినియోగిస్తే ఇంకా మంచిది.

దీపావళి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని పాతబడిన, పనికిరాని వస్తువులను ఇంటి నుంచి పారేయడం ద్వారా కొత్త శక్తిని ఆహ్వానింపజేసుకోవచ్చు. ఉత్తరం దిశలో కుబేర స్థానం సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకుంటే మంచిది. అలాగే అమర్చిన లాకర్‌లో లక్ష్మీదేవిని ప్రతిమను ఉంచుకుని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, సంపదలు వెల్లివిరుస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com