దీపావళి స్పెషల్ స్టోరీ

- October 18, 2017 , by Maagulf
దీపావళి స్పెషల్ స్టోరీ

దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. దీప మాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు ఇది. అందుకే, దీనికి ‘దీపావళి’ అన్న పేరు వచ్చింది. ఒక్క మన దగ్గరే కాదు, దేశ విదేశాల్లోని భారతీయులంతా అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునే పండగ ఇది.
హిందువుల పండుగలలో అతిముఖ్యమైనది ” దీపావళి” . సమగ్ర భరతఖండంలో హిందువులే కాకుండా బౌద్ధులు, జైనులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ” నరకాసుర సమ్హారము ” మన అందరకూ సుపరిచితమైన విషియమే. అయితే ఈ పండుగను జర్పుకొనే విధానంలో ప్రాంతీయ బేధాలున్నాయి. మనం అమావాస్య ఒక్కరోజే పండుగ చేసుకుంటాం. ఉత్తరాదిన 5 రోజుల పండుగ ఇది. తమిళనాట నరకచతుర్దశి నాడు సూర్యోదయానికి ముందు జరుపుకుంటారు.భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవ స్య రోజున వస్తుంది.

దీపావళి: (ధనలక్ష్మి పూజ, కేదారేశ్వర వ్రతం)
నరక చతుర్దశి తర్వాతి రోజు దీపావళి అమావాస్య. ఇది ఆశ్వయుజ మాసపు చిట్టచివరి రోజు. ఈ రోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే చీకటిపై వెలుతురు సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపావళిని జరుపుకుంటున్నం. కొన్ని ప్రాంతాలలో పగలంతా ఉపవాసముండి, సాయంత్రం లక్ష్మీదేవిని పూజించే ఆచారం వుంది.దీపావళి రోజు సాయంత్రం కొత్త బట్టలు ధరించి తప్పకుండా ధనలక్ష్మిని పూజించాలి. ఈ రోజు మహాలక్ష్మిదేవి భూలోకానికి వస్తుందంటారు. ప్రతీ ఇంటికి వెళ్తూ, శుభ్రంగా అలికి ముగ్గులు వేసిన ఇండ్ల ముందు తన కళను వదిలి వెళ్తుందని ప్రజల నమ్మకం. ఉత్తర భారత దేశంలో ధనలక్ష్మీ పూజ ఈ అశ్వయుజ అమావాస్య చాలా ప్రశస్తమయిందిగా భావిస్తరు.ఈరోజు వ్యాపారులు లాభనష్టాలను పరిశీలిస్తారు. లక్ష్మీపూజ కోసం తప్పకుండా వారి వారి శక్తి మేరకు బంగారం, వెండి కొంటరు. తెలంగాణ ప్రాంతంలో వ్యాపారులు ఆనాటి సాయంత్రం ధనలక్ష్మిని భక్తితో పూజించి, తమ వ్యాపారం దినదిన ప్రవర్దమానం కావాలని కోరుకుంటరు.లక్ష్మీ పూజానంతరం కుటుంబ సభ్యులందరూ మధురమైన తీపి పదార్ధాలను ఇతరులకు పంచి పెడతారు. టపాకాయలు కాలుస్తరు.ముఖ్యంగా పల్లె ప్రాంతాలలో దీపావళిని ‘దివిలి పండగ’ అంటరు. పసుల పిల్లలు గోగు (పుట్టి) కట్టెలతో కట్టలను కట్టి రాత్రి సమయంలో వెలిగించి తిప్పుతరు. దీనివల్ల ఆపదలన్నీ తొలగిపోయి, సుఖ సంతోషాలు కలుగుతవని వారి నమ్మకం.తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నుండే కేదారేశ్వర వ్రతం ప్రారంభిస్తారు. మంగళ ప్రదాయిని అయిన ఈ గౌరీదేవి వ్రతం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. అయితే, ఈ గౌరీ నోములను కొందరు కార్తీకమాసంలో దశమి నోములుగానూ నోముకుంటరు.అజ్ఞానమనే అమావాస్య చీకట్లను పారవూదోలి విజ్ఞానమనే వెలుగులను నింపి, జగత్తును తేజోమయం చేసే పండగ దీపావళి. దరివూదానికి అధిదేవతయైన జేష్ఠ్యాదేవిని పారదోలి సంపదల తల్లియైన లక్ష్మీదేవికి స్వాగతం పలికే పండగగానూ దీనిని భావించాలి. పాఠకులు అందరికి " మా గల్ఫ్ డాట్ కామ్ " దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com